
— అశోక వనంలో సీత అమ్మవారును హనుమంతుడు కలిసిన రోజు
మంథని డిసెంబర్ 3( ప్రతిఘటన )
మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో బుధవారం 107వ గణపతి గణపతి అధర్వ శీర్ష సహస్ర అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. మార్గశీర్ష శుక్ల పక్ష త్రయోదశి పర్వ దినమును పవిత్రమైన హనుమత్ వ్రతం అని కూడా అంటారు. ఈరోజున అశోక వనములో హనుమంతుడు సీతా అమ్మవారిని కలిసిన రోజు.
మార్గశీర్షె త్రయో దశ్యాం-
శుక్లాయాం జనకాత్మజ!
దృష్ట్యా దేవీ జగన్మాతా
మహావీరేణధీమతా!!
అనే శ్లోకం ఎంతో మహిమాన్వితమైనది. ఈ కార్యక్రమాన్ని మంథని శ్రీ మహా గణపతి దేవాలయంలో 107 వ గనపతి అథర్వశీర్ష సహస్ర అభిషేకం (వెయ్యి సార్లు)అలాగే మన్యు సూక్త అభిషేకం 108 సార్లు జరుప నిర్వహించారు. ఉదయం 8.00 గం. నుండి 12.30 వరకు గణపతి గుడిలో కార్యక్రమము,తదనంతరం మంథని గాయత్రి వైదిక సంస్థ వరంగల్ వారి సౌజన్యం తో దత్త నవరాత్రుల్లో భాగంగా దత్త గుడి లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పల్లి రాము, సంజీవ్, మహావాది వినోద్ కుమార్, అవధాని మోహన్ శర్మ, నల్లగొండ శ్రీనివాస్, కొండెల బలరాం, మరుపాక శేషు, మారుపాక రాజేందర్, బుర్ర రామకిషన్, రామడుగు మారుతి, రాంపల్లి సదాశివ్, దహగం రజనీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
