భూభారతి చట్టంతో రైతులకు మేలు చేసేదెప్పుడు?
భూమి హక్కుల రికార్డుల గందరగోళం
రెవెన్యూ అవినీతి, న్యాయవ్యవస్థ హెచ్చరికలు – రైతు వ్యథకు అద్దం

విశ్లేషణాత్మక కథనం
డిసెంబర్ 30, ప్రతిఘటన : రైతు భూమి సమస్యలు కొత్తవి కావు. కానీ ధరణి పోర్టల్ ప్రారంభం తర్వాత అవి మరింత సంక్లిష్టంగా మారాయి. భూమి హక్కుల రికార్డులు, పట్టాలు, మ్యూటేషన్లు, వారసత్వ మార్పులు—ఇవి రైతు జీవితంలో ప్రశాంతతనిచ్చే అంశాలుగా కాకుండా, నిరంతర ఆందోళనకు కారణాలుగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన “తెలంగాణ రాష్ట్ర భూభారతి చట్టం (భూమిపై హక్కుల రికార్డు)–2025” పై రైతుల్లో ఆశలు పెరిగాయి. కానీ ఆ ఆశలు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారడం లేదన్నదే కఠిన వాస్తవం.
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు: రెవెన్యూ వ్యవస్థపై ప్రశ్నార్థకం2025 నవంబర్ 5న తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర విమర్శలుగా మారాయి.రెవెన్యూ శాఖను తొలగిస్తే తప్ప దేశం బాగుపడదు అన్న వ్యాఖ్య, వ్యవస్థలో నెలకొన్న లోపాలను ప్రతిబింబిస్తోంది.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల శివారులోని సర్వే నంబర్లు 11,12,13,29,30,31 లో ఉన్న భూములను ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువు ఎఫ్టీఎల్లో చేర్చడాన్ని సవాలు చేస్తూ బి. కృష్ణారెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం, “చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ మధ్యలో ఉన్న భూములకు పట్టాలు ఎలా ఇస్తారు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఎఫ్టీఎల్లు ఇప్పటికీ ఖరారు కాకపోవడం వల్లే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రైతుల ఆగ్రహం: రాస్తా రోకోలు, ధర్నాలు*భూసమస్యలపై రైతుల నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.
కామారెడ్డి జిల్లా – తాడ్వాయి2025 ఆగస్టులో తమ భూములకు పట్టాలు మంజూరు చేయడంలో తహశీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొఖా రిపోర్ట్ సమర్పించి ఏడాది గడిచినా పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా – గంగాధర మండలం విరాసత్ ప్రక్రియ కోసం లంచాలు అడుగుతున్నారని ఆరోపిస్తూ రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. “లంచం లేకుండా ఫైల్ కదలడం లేదు” అన్నది రైతుల ఆవేదన.
ఖారిజ్ ఖాతా – రైతుకు అర్థంకాని పదం శంకరపట్నం మండలం యరడపల్లి శివారులోని సర్వే నంబర్ 200/2, విస్తీర్ణం 0.38 గుంటలు భూమిని ఖారిజ్ ఖాతాగా నమోదు చేయడాన్ని రైతు తీవ్రంగా వ్యతిరేకించాడు. మూడు సార్లు దరఖాస్తులు ఇచ్చినా తిరస్కరించారు.అయితే సీసీఎల్ఎ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) ఖారిజ్ ఖాతా అంటే ప్రభుత్వ భూమి కాదని స్పష్టత ఇచ్చినా, క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోలేదు. ఇది రైతు–వ్యవస్థ మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
రెవెన్యూ వివాదాలు – ప్రాణాలు తీస్తున్నాయి
2019 నవంబర్ 4న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయంలో జరిగిన సంఘటన తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచింది.గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు కె. సురేశ్ తన భూవివాదం పరిష్కారం కాకపోవడంతో ఎమ్మార్వో కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.ఈ ఘటనలో ఎమ్మార్వో కె. విజయారెడ్డిడ్రైవర్ గురునాథంరైతు సురేశ్ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.భూవివాదాలు రైతుల మానసిక స్థితిని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయో ఈ సంఘటన చెబుతోంది.
ఎన్నికల హామీ – భూభారతి చట్టం
ఈ పరిస్థితుల నేపథ్యంలో 2023 నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో భూవివాదాలు ప్రధాన అంశంగా మారాయి.కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ రద్దురైతులకు మేలు చేసే కొత్త చట్టంఅనే హామీలతో అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 7న సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది.2025 ఏప్రిల్ 14న తెలంగాణ రాష్ట్ర భూభారతి చట్టం ప్రారంభమైంది. రెవెన్యూ సదస్సులు – హామీలకే పరిమితం?మూడు దశల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.జూన్ 21న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి, “8.50 లక్షల దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ దరఖాస్తుల పరిశీలన లేదునిర్ణయాలు లేవురైతులకు సమాచారం లేదు
సైదాపూర్ కేసు: అవినీతికి అద్దంకరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ చట్టం ద్వారా బయటపడిన అవకతవకలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.దుద్దెనపల్లి శివారులోని సర్వే నంబర్ 645/అ భూమి విషయంలో:విస్తీర్ణం మార్పులుసంతకాల లేమిపంచనామా దిద్దుబాట్లుతప్పుడు పట్టా నమోదుఅన్ని చోట్లా నియమావళి ఉల్లంఘన జరిగింది.అసలైన రైతు మేరుగు నారాయణ పేరపై ఉన్న భూమిని అక్రమంగా కేశవేని కనకయ్య పేర పట్టాగా మార్చారు.ఫిర్యాదులు చేసినా, తహశీల్దార్ సివిల్ కోర్టుకు వెళ్లండి అంటూ చేతులు దులుపుకున్నారు.
అధికారాలున్నా బాధ్యత ఎక్కడ?
తహశీల్దార్ – ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ఆర్డీవో – సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్కలెక్టర్ – ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ఇంత అధికారాలున్నా:భూమి రికార్డులు సరిగా నమోదు చేయడం లేదుఅవినీతిపై చర్యలు లేవురైతుకు న్యాయం జరగడం లేదుఅని రైతులు ప్రశ్నిస్తున్నారు.
డిజిటలైజేషన్ ముందే రికార్డులు సరిచేయలేదురెవెన్యూ ఉద్యోగులకు జవాబుదారీతనం లేదుచట్టాలు ఉన్నా అమలు లోపించిందిరాజకీయ పర్యవేక్షణ బలహీనంగా ఉంది భూభారతి చట్టం – అమలే కీలకంభూభారతి చట్టం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టమే. కానీక్షేత్రస్థాయి అమలుఅవినీతిపై కఠిన చర్యలుటైమ్బౌండ్ పరిష్కారాలులేకపోతే ఇది మరో ధరణిగా మిగిలిపోతుంది.
రైతుల ఆకాంక్ష ఒక్కటే:చట్టాలు కాగితాలకే కాదు – మా భూములకు రక్షణ కావాలి.– మేరుగు రాజయ్య(విశ్లేషణాత్మక కథనం)
