
కాలనీ వాసుల అనుమతి లేకుండా నిర్మాణం ఎందుకు? – ప్రశ్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
ఉప్పల్/డిసెంబర్ 05 (ప్రతిఘటన):
ఉప్పల్ భగాయత్ వద్ద నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రం (ఎస్.టి.పీ) పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. స్థానిక నివాసితుల ఆందోళనలు విని ఆమె ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.కవిత మాట్లాడుతూ ఎక్కడో వేరే ప్రాంతానికి సాంక్షన్ అయిన ఎస్టీపీని ప్రజల అభిప్రాయం లేకుండానే ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం అని అన్నారు.స్థానిక ప్రజలకు పార్క్, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా ఎస్టీపీ నిర్మాణం చేపట్టడం ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుందని ఆమె ప్రశ్నించారు.
